Monday, March 29, 2010

ప్రపంచ అహింసా దినోత్సవం , International Non-Violence Day





జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచానికి అందించిన అహింసా విధానాలను గౌరవిస్తూ ఆయన జయంతి (అక్టోబర్ 2)ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ అహింసా దినోత్సవంగా పాటించనుంది. ప్రపంచ వ్యాప్తంగా గాంధీకి నివాళులు అర్పించేందుకు అనేక వేడుక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహాత్ముడు బోధించిన సత్యాగ్రహ సందేశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా వినిపించనుంది.

భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఐక్యరాజ్యసమితి 2007 జూన్‌లో గాంధీ జయంతి (అక్టోబర్ 2)ను ప్రపంచ అహింసా దినంగా ప్రకటించింది. మహాత్ముని సత్యాగ్రహ ఉద్యమానికి నివాళులు అర్పించేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ అయన జయంతిని అహింసా దినంగా పాటించేందుకు అంగీకరించాయి. హింసోన్మాదం పెట్రేగిపోతున్న ఈ రోజుల్లో గాంధీజీ సిద్ధాంతాల అమలు నిజంగా ఆవశ్యకం. గాంధీ జయంతి పేరిట ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలను నిర్వహించడం కాకుండా చిత్తశుద్ధితో వాటిని చేపడితే నిజమైన గాంధేయవాదులు అవుతారు.
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .