Saturday, August 14, 2010

Left Handers Day , లెఫ్ట్ హేండర్స్ డే



మన రోజువారీ పనుల్లో చేతుల పాత్ర కీలకం . ఈ విషయం లో కుడి చేతినే మంగళప్రదము గా భావిస్తుంటారు . ప్రధానముగా డబ్బు , బంగారము మొదలగు ముఖ్యమైన వస్తువులను ఇతరులకు ఇచ్చేటప్పుడు పొరపాటున ఎడమ చేతిని ఉపయోగించినా పెద్దలు మందలించడం మనము చూస్తూఉంటాము . రాత విష్యానికొస్తే ... అక్షరాభ్యాసం నాడే గురువులు చిన్నారి కుడిచేతిని పట్టుకొని అక్షరాలను దిద్దిస్తుంటారు . ఇలాంటి ప్రత్యేకత కుడిచేతికే ఉన్నప్పటికీ ఇటీవల ఎడమ చేతివాటము వాళ్ళకూ ప్రత్యేకత వచ్చింది . కొంతమందైతే కుడిచేతి వారి కంటే అందమైన చేతిరాతతో ఆకట్టుకుంటున్నారు . ఈ చేతి వాటం వారు నాయకులుగా , క్రీడాకారులుగా , కళాకారులు గా , సంగీత విధ్వాంసులుగా .. మరెన్నో ఇతర రంగాలలో రాణించిన దృష్టాంతాలున్నాయి .

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ , బిగ్-బి అమితబ్ , క్రికెట్ ప్లేయర్ టెండూల్ కర్ , గంగూలీ , అంధ్రప్రదేశ్ మాజీగవర్నర్ సి.రంగరాజన్‌ , అలనాటి సినీతారలు సావిత్రి , సూర్యకాంతము ఎడమచేయి వాటము వాల్ళే . ఎం.టి.ఆర్ ఎడమచేతినే ఉప యోగించేవారు .
1990 లో U.K లోఎడమచేతి వాటస్తుల క్లబ ఏర్పాటయినది . అభివృద్ధి పట్ల సభ్యులకు అవగాహన కల్పించేందుకు , వీరికోసం ప్రత్యేకముగా తయారు చేయాల్సిన వస్తువులు గుఎఇంచి తయారీదారులకు అవగాహన కల్పించే ఉద్దేశముతో ఈ క్లబ్ ఏర్పాటయినది . ప్రపంచవ్యాప్తంగా గల సభ్యులతొ బలోపేతం అయినది . ఎడం చేతి వాటస్తులకు సంబంధించి అన్ని రకాలౌగా సలహాలిచ్చే కేంద్రాలు ఏర్పాటయ్యాయి . మొదటిసారిగా 1992 ఆగస్టు 13 తీదీన లెఫ్ట్ హ్యాండర్స్ కబ్ " అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే " ను జరుపుకోవడం ఆరంభించినది . ఏటేటా ఎడాంచేతి వాటస్తుల వార్షికోత్సవం జరుపుకుంటూ ఈ చేతివాటం వల్ల గల ప్రయోజనాలు . లోపాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశం తో ప్రపంచవ్యప్తం గా గల తెఫ్ట్ హ్యాండర్లు ఈ ఇంటర్నేషనల్ డే ని నిర్వహి్స్తారు .

మహారాస్ట్ర లోని పూణె లో వామహస్తీయుల సంఘం ఉన్నది . ఈ సంఘం అంచనాల ప్రకారము ప్రపంచములో 10 శాతము మంది ఎడమచేతివాటము ఉన్నవాళ్ళు ఉన్నారు . ఈ సంగం చిరునామా :
  • అస్సోసియేషం ఒఫ్ లెఫ్ట్ హేండ్ ,
  • 10 గీతాంజలి అపార్ట్ మెంట్ ,
  • ఎన్‌.తంజివాడ ,
  • శివాజీ నగర్ ,
  • పూణె -411005.
ఎంతోమంది ఎడమ చేతి వాటము వారు మంచి ఉద్యోగాలలో ఉన్నారు . వీరు ఎడమచేతితో వేగం గానే రాయగలరు . దస్తూరీ కూడా బాగానే ఉంటుంది . రాయడం లో ఎలాంటి ఇబ్బందులు లేవనే అంటారు . ఏ చేతితో పనులు చేసినా జరిగే పనిలో తేడా ఉండదు ... మంచి , చెడు అనేది అంతా వారి మనసులోనే ఉంటుంది .. . కుడిచేతితో ఏదైనా ఇతరులకు ఇస్తే లాబమని ... ఎడమ చే్తితో అయితే అశుభమని అనుకుంటారు తప్ప అలా ఏమీజరుగదు .

  • ==================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .