Sunday, January 16, 2011

భారతదేశము లో యువజన దినోత్సవాలు, National youth Day Celebrations

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Jan 12 th ) న యువజన దినోత్సవాలు గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


భారతదేశము లో యువజన దినోత్సవాలు :

భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు స్వామీ వివేకానంద,తన బోధన్ల ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.

ఈ రోజు జనవరి 12న సామీ వివేకానంద జయంతి అన్న విషయం యావద్భారతీయులకూ ఆనందం కలిగించే విషయం. ముఖ్యంగా ఈ రోజును యువజన దినోత్సవంగా నిర్ణయించి, యువతకు స్ఫూర్తిని గొలిపే అత్యుత్తమమైన రోజు.
ఈ సందర్భంగా ముందుగా యావద్భారతీయ యువతీ యువకులకు నా మనఃపూర్వక అభినందనలు.

స్వామి వేకానంద 148వ జయంతి ఉత్సవాలు శ్రీకాకుళం లో బుధవారం జరవరి 12 వ తేదీన నిర్వహించారు. స్థాని క గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి దూసి లక్ష్మణరావు ఆధ్వర్యంలో వివేకానంద చిత్ర పటానికి ఆర్‌సిఎం హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయు లు డి.విజయప్రసాద్‌, ఉపాధ్యాయులు టి.కాళిదాసు, ఆర్‌.శ్రీను పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. యువజన దినోత్సవం సందర్భంగా గ్రంథాలయం వద్ద పాటల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎంఇఓ డి.ప్రకాశరావు బహుమతులు అందజేశారు.యువజన దినోత్సవం సందర్భంగా ప్రతిభావంతులను ఘనంగా సన్మానించారుస్

స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద ఆశయయ సాధనలో గత దశాబ్ద కాలంగా సంఘ సేవా, సామాజిక కార్యక్రమాలే పరమావదిగా భావించి సమాజం పట్ల గౌరవం, అంకితభావంతో పని చేస్తూ పర్యావరణ పరిరక్షణ, యువజన సదస్సులు, పల్స్‌ పోలియో, ఎయిడ్స్‌ నిర్మూలన, రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుపుతారు . తన బోధనలు, రచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత . కొన్ని జిల్లాలో జాతీయ యువజన వారోత్సవాలను నిర్వహిస్తున్నారు .ఈ సందర్భముగా స్వామి వివేకానందుని విగ్రహానికి పూలమాలల అలంకరణలో యువజనోత్సవాలు ప్రారంభమవుతాయి . వ్యాసరచన, ఉపన్యాస పోటీలను, రంగోళి, మెహంది పోటీలను, స్వశక్తి మహిళల గ్రూపుల్లోని మహిళలకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, జానపద, దేశభక్తి గేయాలు, పురుషులకు కబడ్డీ, ఖో-ఖో పోటీలను ఈ వారోత్సవాలలోలో నిర్వహిస్తారు. జాతీయ సమైక్యత, ప్రభుత్వ పథకాలు, ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కార్యక్రమం, రక్తదాన శిబిరం వంటి ఏర్పాటు చేస్తారు .

వివేకానంద బలమే జీవితమని, బలహీనతే మరణమన్నారు. విద్యార్థులకు, యువతీ, యువకులకు రామకృష్ణ వివేకానంద సందేశాలతో చైతన్య పరచనున్నాయి . కులం, మతం, ప్రాంతం, భాష వంటి భావోద్రేకాలకు కొట్టుకుపోయి హింసాత్మక ఆందోళనలకు పాల్పడవద్దని రాష్ట్రంలోని యువతకు సూచించాలి . యువకుల కోసం పాటుపడేందుకే కేంద్ర ప్రభుత్వం నెహ్రూ యువకేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది ప్రతి ఏటా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది.

వివేక' సూక్తులు..
* పశువుని మానవుడిగానూ, మానవుణ్ణి మాధవునిగాను మార్చేదే నిజమైన మతం.
* జీవితాన్ని మలచుకోవడానికి, మనగడని ధన్యం చేసుకోవడానికి, చక్కటి నడవడికని రూపొందించడానికి సహకరించే ఆలోచనలని మనిషి మనసులో నాటి, వాటిని జీవితంలో ప్రతిఫలింపచేసేదే నిజమైన విద్య.
* ముసలితనం ఆలోచిస్తుంటుంది. యవ్వనం సాహసం చేయగలుగుతుంది.
* జీవితం అంటే రహస్యంగా ఆనందాలను అనుభవించడం కాదు. ఎన్నో అనుభవాల ద్వారా ఎన్నెన్నో కొత్త విషయాలను నేర్చుకోవడం.
* ధనం వల్ల పేరు, ప్రతిష్టల వల్ల విద్య.. వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మంచి శీలం మాత్రమే దుస్సాధ్యమైన కష్టాల అడ్డుగోడలను పగులకొట్టుకొని ముందుకు చొచ్చుకపోతుంది.
* తన మీద తనకు నమ్మకం లేనివాడు నాస్తికుడు.
* మీరు ఎలా అనుకుటే అలా తయారవుతారు. మిమ్మల్ని మీరు బలహీనులు అనుకుంటే బలహీనులుగా మారుతారు. మీరు బలవంతులనుకుంటే బలవంతులుగా అవుతారు.


యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలి . యువత మద్యపానం, దూమపానం, మాదకద్రవ్యాలు వంటి దురలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలి . ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి , గ్రామాభివృద్దికి కృషి చేయాలి , యువత ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలి . యువతరం తమ ధోరణి మార్చుకోవాలి .. తిరుగులేని తమ శక్తితొ వ్యక్తిగతం గాను , సామాజికం గాను , జాతి పరం గాను ఎదగాలి .అప్పుడే యువజనోత్సవాలు సార్ధకమౌతాయి .

ఇక ప్రపంచ యువజన దినోత్సవాలు ఆగస్టు 12 న జరుపు కుంటున్నారు .

More details Click here-> ప్రపంచ యువజన దినోత్సవం


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiKtlrTdZqhJdjeU9F8YtYCStrMVFGu5MxTgRfQN1w_LPq1_0yaXAx4Qw_j-zzPg2ediLvQfIkCDRlEM5YPevDv6qiBxsA_HqoPFvB8shnClKz9yiex7YUQY8IBjkUTvpuHErYgO3bBVCrA/s1600/Teenegers+Day+boys.jpg
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .