Wednesday, November 5, 2014

Central Excise duty Day ,సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డే

గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (ఫిబ్రవరి 24.) -Central Excise duty Day ,సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డే- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



1944 నాటి చట్తము అమలుకు గుర్తుగా సెంటల్ ఎక్సైజ్ డే ను మన దేశ వ్యాప్తముగా ఫిబ్రవరి 24 న నిర్వహిస్తారు. ఈ రొజున దేశములో వివిధ రాష్ట్రాలు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రభుత్వములో పన్నుల వసూలుకు సంబంధించి నిజాయితీతో , చిత్తశుద్దితో పనిచేసిన అధికారులకు రివార్డులు అందజేస్తారు. పన్ను చెల్లింపుల గురించి ప్రజల్లో ఎవేర్నెస్ పెంచేందుకుగాను విభిన్న కార్యక్రమాలు , వర్క్ షాపులు , సెమినార్లు నిర్వహిస్తారు. ఎక్సైజ్  అన్న పదము డచ్ యాక్సిజిన్స్  అనే పదము నుంచి వచ్చింది. దీనికి లాటిన్‌ మూలము పన్నువేయడము అని అర్ధము .

ఏటేటా కేంద్రప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెడుతుంది . ప్రతి ఒక్కరూ ప్రభుత్వము ఎక్సైజ్ సుంకాలు ఎంతవిధిస్తుందోనని ఆసక్తిగా , భయంగా ఎదురు చూస్తారు. ఈ సుంకము ప్రభావము ప్రత్యక్షముగాను , పరోక్షముగానూ ఉంటుంది. అటు తయారీదారులు ... ప్రభుత్వానికి నేరుగా చెల్లిస్తే ... ఇటు వినియోగదారులు తయారీదారులకు , అమ్మకం దారులకు చెల్లిస్తూ ఉంటారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ చట్తము ప్రకారము ఈ పన్నులు విధిస్తారు. 1985 సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ చట్తములోని షెడ్యూల్ 1 మరియు 2 కింద డ్యూటీ రేట్లు , యాడ్ వలోరెమ్‌(విలువ పై) లేదా స్పెసిఫిక్ లు విధిస్తారు.సెంట్రల్ ఎక్సైజ్ చట్టము కింద పన్ను విధించే అంశము " మానుఫ్యాక్చర్ '' , సెంట్రల ఎక్సైజ్ డ్యూటీ , లయబిలిటీ ..వస్తువులు తయారీకాగానే తలెత్తుతుంది. అదనపు పన్నుల (ప్రత్యేక ప్రాముఖ్యము గల వస్తువులు ) చట్టము కింద , అడిషినల్ డ్యూటీస్ (టెక్స్ టైల్స్ మరియు టెక్స్ టైల్స్ ఆర్టికల్స్ ) యాక్ట్ మఒదలన వాటి కింద విధించిన వివిధరకాల పన్నుల్ని వసూలుచేయడానికి కూడా సెంట్రల్ ఎక్సైజ్ అధకారులు బాధ్యతలు తీసుకుంటారు.

సెంట్రల్ ఎక్సైజ్ చట్టాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సర్ సైజ్  మరియు కస్టమ్‌స్ ఫీల్డ్ అధికారులు సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్ల ద్వారా నిర్వహిస్తుంది. ఈ ప్ర్యోజము కోసము దేశాన్ని పదిజోన్లుగా విభజించారు . ప్రతి జోన్‌ కు చీఫ్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ హెడ్స్ అధికారులు గా ఉండి పర్యవేక్షిస్తుంటారు. సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ లేదా అసిస్టెంట్ కమిషనర్లు  , సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ల ఆధిపత్యము డివిజన్లు , ప్రాంతాలుగా విభజిస్తారు.  ఎక్సైజ్ టాక్స్ అనేది అమ్మకాలు లేదా అమ్మకాలకు  జరిగే ఉత్పత్తులపై ఇన్‌ల్యాండ్ ట్యాక్స్ గా ఉంటుంది. అమ్మకానికి తయారుచేసే ప్రత్యేక వస్తువుల అమ్మకం పై విధించే పన్ను .

ఎక్సైజ్ ను కస్టమ్‌సు డ్యూటీ నుంచి విభజించాలి. కస్టమ్‌డ్యూటీ ఇంపోర్టేషన్‌ పై పన్నులు మరియు సరిహద్దు పన్నులు. , ఎక్సైజ్ సుంకాలు ఇన్‌ల్యాంట్ టాక్స్ లు . ఎక్సైజ్ సుంకాలు పరోక్ష పన్నులు . . ఉత్పత్తి దారులు , అమ్మక దారులు పభుత్వానికి పన్ను చెల్లించి .. దాన్ని వినియోగదారు చెల్లించే ధరును పెంచడము ద్వారా రాబట్టుకుంటారు. సేల్స్ ట్యాక్స్ , వ్యాల్యుయాడెడ్ ట్యాక్స్ వంటి పరోక్ష పన్నులకు ఈ ఎక్సైజ్ మరో అదనపు  పన్ను.ఎక్సైజ్ రెగ్యులేటరీ , చట్టబద్ద నిర్వచనాలు ఒక్కో దేశానికి ఒక్కోవిధముగా ఉంటాయి. మనదేశములో ఎక్సైజ్ అన్నమాట పూరి ఎకడమిక్ కాదు .వివిధ కోర్టుకేసులకు కూడా వర్తిస్తుంది. ఎక్సైజ్ సుంకాన్ని చిధించే సమయములో ప్రజారక్షణ , ఆరోగ్యము , ప్రజాజైతిక విలువలు , జాతీయ సంక్షేమము వంటి అనేక అంశాల్ని పరిగననలొకి తీసుకుటారు . మనదేశములో దాదాపు అన్ని తయీ ఉప్తప్త్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. ఇందుకోసము భారత ప్రభుత్వము ఆటోయేషన్‌ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్  & సరీస్ ట్యాక్స్ నెలకొల్పింది. దీనివల్ల తయీదారు తమ ఎక్సైజ్ సుంకాన్ని సులువుగా చెల్లించవచ్చు . అమ్మకము వస్తువులు పై రెవెన్యూ స్టాంప్ ఎఫిక్స్ చేయడం ద్వారా ఎక్సైజ్ పన్ను అప్లయ్ చేస్తారు.




  • =========================================

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .